గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
నల్లగొండ: గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక నిమజ్జన మార్గాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,184 గణేష్ విగ్రహాలు ఏర్పాటు కాగా, నిమజ్జన బందోబస్తు కోసం సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలను నిర్ణయించారు. 10 అడుగుల లోపు విగ్రహాలను బతుకమ్మకుంట/వల్లభరావు చెరువులో, 10 అడుగులకు పైగా...