హయత్‌నగర్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలకలం

730 కిలోల పేస్ట్, గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్ స్వాధీనం హయత్‌నగర్: హయత్‌నగర్‌లోని అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్న యూనిట్‌లో సుమారు 730 కిలోల పేస్ట్, గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ద్రావణం, ఫుడ్ కలర్‌ను పేస్ట్ తయారీలో ఏ...