‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక
తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దివంగత నేత, మాజీ మంత్రి ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ (AMF) ఈ పురస్కారాన్ని అందిస్తోంది. ప్రజాస్వామిక విలువల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను అవార్డు జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంపీ బెన్నీ...