విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ ప్రతిబింబించేలా నూతన నిర్మాణాల డిజైన్లు రూపొందించాలని నిర్ణయించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప దేవాలయం, పిల్లలమర్రి ఆలయాల శిల్ప, వాస్తు శైలులను పరిశీలించి, వాటి స్ఫూర్తితో విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ డిజైన్లు రూపొందించే అంశంపై చర్చించారు. విమానాశ్రయాల పనులను వేగవంతం చేసేందుకు...