వంట గొడవ.. కాల్పులకు దారి

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో వంట విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం విషాదంగా మారింది. చిన్నపాటి గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన భర్త ఇంట్లో ఉన్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్దం విన్న పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను కాల్చిన అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చిన్నపాటి...