బెడ్డు దొరకలేదని వెనక్కి పంపారా.. 24 ఏళ్ల యువకుడి మృతి

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలపై ప్రశ్నలు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాల కొరతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా బెడ్ అందుబాటులో లేదని వైద్యం అందించకుండా వెనక్కి పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు అప్పు చేసి ఆదిల్‌ను నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి రెండు రోజుల పాటు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో...