దేవరకొండ మండలం, కొమ్ము తండా లోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.

దేవరకొండ మండలం, కొమ్ము తండా లోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు ఆదివారం అయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి కొమ్ము తండా భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని, లైటింగ్ ,గజ ఈతగాళ్లు, క్రేన్లు అన్ని ఏర్పాట్లు చేయాలని ,ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని,...