మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు
27న విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయ కెరటం): సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాహితి ఇన్‌ఫ్రా నుంచి ఎమ్మెల్యేకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోకి సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీల స్వభావం, ఉద్దేశం, వాటికి సంబంధించిన ఆర్థిక...