జగిత్యాలలో వైభవంగా తొలి రోజు గణేష్ నిమజ్జనం
గణపతుల శోభాయాత్రకు పోటెత్తిన భక్తులు.. పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిమజ్జనం జగిత్యాల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23 (విజయ కెరటం): తొమ్మిది రోజులుగా భక్తుల పూజలందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. ‘వచ్చే ఏడాది త్వరగా రా’ అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. గణనామస్మరణతో జగిత్యాల పట్టణం మార్మోగింది. ఉదయం నుంచే గణేష్ మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూలమాలలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాలపై గణనాథులను ఉంచి శోభాయాత్ర...