రూ.40 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి

మహబూబ్‌నగర్: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతల్‌లో ఫర్దీపూర్–ముచ్చింతల్ గ్రామాల మధ్య ఊకచెట్టు వాగుపై రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి (HLB) నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణంతో ఫర్దీపూర్–ముచ్చింతల్ గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రజల రవాణా అవసరాలు తీరడంతో పాటు ఈ ప్రాంతంలో రాకపోకలు మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధికి వంతెన కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు