ఐకాన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.5 లక్షల జరిమానా
నల్లగొండ, సెప్టెంబర్ 25 (విజయ కెరటం): నల్లగొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ రూ.5 లక్షల జరిమానా విధించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం–2010 నిబంధనల అమలులో భాగంగా ఆగస్టు 11న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రికి సంబంధించి మొత్తం 10 లిఖితపూర్వక ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలో పలు నిబంధనల ఉల్లంఘనలు, లోపాలు గుర్తించడంతో ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు....