వల్లభరావు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన

నల్గొండ పట్టణ సమీపంలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి మంగళవారం రాత్రి పరిశీలించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, బ్యారికేడింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని విధుల్లో నియమించామని, వారంతా విధులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు....