ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: భారత ఎన్నికల సంఘం (ECI)లో ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై అంతర్గత విభేదాలు ఉన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధన కథనం వెల్లడించింది. గత పది నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కలిసి 14 సందర్భాల్లో అధికారికంగా ఫైళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. ఫారం-6లో మార్పులపై ప్రశ్నలు కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో గత ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారు...