VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:41 am Posted by : VIJAYA KERATAM

లగ్జరీ కారులోనూ భద్రత ప్రశ్నార్థకమేనా?

  1. సూర్యాపేట–ఖమ్మం హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం మమత ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ముందు భాగంలో మంటలు చెలరేగి, క్షణాల్లో వాహనం మొత్తం వ్యాపించినట్లు సమాచారం.
  2. ప్రమాదం అనంతరం కారు డోర్లు వెంటనే తెరుచుకోకపోవడం, తీవ్ర గాయాల కారణంగా బయటకు రాలేకపోవడం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే ప్రమాదానికి అసలు కారణం, మంటలు ఎలా చెలరేగాయి, డోర్లు ఎందుకు తెరుచుకోలేదు అనే విషయాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.

అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్న ఖరీదైన వాహనాలు కూడా తీవ్రమైన ప్రమాదాల్లో ఎలా స్పందిస్తాయనే అంశంపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. వాహనాల భద్రతా ప్రమాణాలు, ప్రమాద సమయంలో ప్రయాణికులు త్వరగా బయటపడే అవకాశాలపై మరింత దృష్టి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి