గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలు
నల్లగొండ, సెప్టెంబర్ 22 (విజయ కెరటం ప్రతినిధి): నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు తమ విగ్రహాల ఎత్తును ముందుగానే పరిశీలించుకుని, నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాలకు అనుగుణంగా రూట్...