TGTET ఇన్‌-సర్వీస్‌ 2026 ఫలితాలు విడుదల

70.07 శాతం ఉత్తీర్ణత.. 15,749 మంది అర్హత హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET–In-Service Teachers–2026) ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, TGTET ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను ప్రకటించారు. జూలై 21న విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో మూడు విడతల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించారు. మొత్తం 24,986 మంది దరఖాస్తు...