ఎంజీఎం దుస్థితిపై సీఎం దృష్టి సారించాలి

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో ఘటన అనంతరం అధికారులు ఆస్పత్రిని పరిశీలించినప్పటికీ, ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ పెచ్చులు ఊడిపడటంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వెయ్యి పడకల ఆస్పత్రిలో రోగులను తరలించేందుకు సరిపడా స్ట్రెచర్లు, సెలైన్‌ స్టాండ్లు అందుబాటులో లేవని ఆరోపణలు ఉన్నాయి. ఏడు అంతస్తుల భవనంలో ఒక్క లిఫ్ట్‌ మాత్రమే పనిచేస్తుండటం, రక్త పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత, 2డీ ఎకో వంటి...