టీఎన్జీవోస్ మ్యాక్స్ సొసైటీ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం

హైదరాబాద్: టీఎన్జీవోస్ మ్యాక్స్ సొసైటీ లిమిటెడ్, గచ్చిబౌలిలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో టీఎన్జీవోస్ యూనియన్ అధికారిక ప్యానెల్ అభ్యర్థులు కారం రవీందర్ రెడ్డి, కట్కూరి శ్రీకాంత్ విజయం సాధించారు. మొత్తం 2,107 మంది సభ్యులకు గాను 867 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 7 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. కారం రవీందర్ రెడ్డికి 583 ఓట్లు, కట్కూరి శ్రీకాంత్‌కు 302 ఓట్లు లభించాయి. ఎన్నికల అధికారి మోహన్ రావు ఇరువురినీ విజేతలుగా అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఉమాదేవి,...