హైదరాబాద్ రెస్టారెంట్లలో అపరిశుభ్రత.. 8 ఫుడ్ లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రత వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 24న TG SAFEకు చెందిన 8 బృందాలు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, ఎలుకల విసర్జితాలతో పాటు అపరిశుభ్రమైన వంటగదులు, పాత్రలు, డ్రైనేజీ వ్యవస్థలను గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, సరైన స్టోరేజ్–లేబులింగ్ లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. కల్తీ అనుమానంతో 16 ఆహార నమూనాలను సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన...