అమెరికా గడ్డపై జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం.. ట్రంప్‌ స్వయంగా ఆహ్వానం

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 25: వాణిజ్యం, సాంకేతికత, తైవాన్‌, ఇరాన్‌ తదితర అంశాలపై అమెరికా–చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు చేరుకున్నారు. మేరీల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ఘన స్వాగతం పలికారు. వంద అడుగుల రెడ్‌కార్పెట్‌, సైనిక గౌరవ వందనం, రక్షణ విమానాల ఫ్లైఓవర్‌తో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్‌, జిన్‌పింగ్‌ పరస్పరం కరచాలనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం జిన్‌పింగ్‌ గౌరవార్థం ట్రంప్‌ దంపతులు శ్వేతసౌధంలో...