VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 1:14 am Posted by : VIJAYA KERATAM

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీసోదాలు.. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టివేత

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీసోదాలు.. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ పట్టివే

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ కొండలరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్ కొండలరావుతో పాటు ఓ కానిస్టేబుల్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.