ఏకలవ్య హైస్కూల్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

విజయ కెరటం ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ఏకలవ్య హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. శనివారం ప్రారంభం కానున్న ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో విద్యార్థినులు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. పరీక్షల హడావిడి ముగియడంతో బతుకమ్మ పండుగ విద్యార్థినుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. వివిధ రకాల సంప్రదాయ వస్త్రధారణలతో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ వేడుకలను ఆసక్తిగా తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయినులు సైతం విద్యార్థినులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు...