నల్గొండలో బిజినెస్ ట్రాప్ కలకలం.. పెట్టుబడుల పేరుతో మోసం చేశారంటున్న బాధితులు

నల్గొండ, అక్టోబర్ 7: విజయ కెరటం ప్రతినిధి బిజినెస్ పేరుతో పెట్టుబడులు సేకరించి మోసం చేస్తున్నారంటూ నల్గొండలో పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ముందుగా పరిచయాలు పెంచుకుని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు తీసుకుంటున్నారని, ప్రారంభంలో కొంతకాలం లాభాలు చెల్లించి నమ్మకం పెంచుకున్న తర్వాత అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. మూడు నెలల పాటు లాభాలు చెల్లించి, నాలుగో నెలలో డబ్బులు ఇవ్వకుండా, ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను...