నల్గొండ, అక్టోబర్ 8: విజయ కెరటం తెలుగు దినపత్రికఛాతీ భాగానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులకు థొరాసిక్ సర్జరీ ద్వారా సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. థొరాసిక్ సర్జరీ అనేది ఛాతీ భాగానికి సంబంధించిన శస్త్రచికిత్సల్లో ప్రత్యేకమైన వైద్య విభాగమని వివరించారు. ఊపిరితిత్తులు, ఆహార నాళం, ఛాతీ గోడ, ఛాతీ మధ్యభాగంలోని అవయవాలకు సంబంధించిన వివిధ సమస్యలకు అవసరమైన శస్త్రచికిత్సలు ఈ విభాగం ద్వారా నిర్వహిస్తారని తెలిపారు.
థొరాసిక్ సర్జరీకి కార్డియో-థొరాసిక్ సర్జరీతో సంబంధం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది ప్రత్యేకమైన సబ్-స్పెషాలిటీగా అభివృద్ధి చెందిందని డాక్టర్ రోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు ఛాతీకి సంబంధించిన ఇతర సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమని అన్నారు. వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించి మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని, ఛాతీకి సంబంధించిన అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రోహన్ రెడ్డి సూచించారు