ఛాతీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలి థొరాసిక్ సర్జరీపై అవగాహన కల్పించిన యశోదా హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ రోహన్ రెడ్డి

నల్గొండ, అక్టోబర్ 8: విజయ కెరటం తెలుగు దినపత్రికఛాతీ భాగానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులకు థొరాసిక్ సర్జరీ ద్వారా సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని యశోదా హాస్పిటల్స్, సోమాజిగూడ కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. థొరాసిక్ సర్జరీ అనేది ఛాతీ భాగానికి సంబంధించిన శస్త్రచికిత్సల్లో ప్రత్యేకమైన వైద్య విభాగమని వివరించారు. ఊపిరితిత్తులు, ఆహార నాళం, ఛాతీ గోడ, ఛాతీ మధ్యభాగంలోని అవయవాలకు సంబంధించిన వివిధ సమస్యలకు అవసరమైన శస్త్రచికిత్సలు...