### రెండో పంట వేయొద్దు.. రైతులకు మంత్రి పొంగులేటి సూచన
తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పెద్దన్నలా ఆదుకోవాలి – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రైతులు ప్రస్తుతం రెండో పంట సాగు చేయవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండో పంట వేయొద్దని చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి పంటను కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
విద్యుత్‌ను పొదుపుగా ఎలా వినియోగించాలి, ప్రజలకు తాగునీటిని ఎలా సమకూర్చాలనే అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణను ఆదుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కో
రారు.