VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 1:06 pm Posted by : VIJAYA KERATAM

రామగిరి రామాలయంలో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మేయర్ దంపతులు

రామగిరి రామాలయంలో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మేయర్ దంపతుల

నల్లగొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం):

 

నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, జమ్మి పూజ కార్యక్రమాల్లో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దసరా పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, జమ్మి పూజకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. పండుగలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, భక్తులు పాల్గొన్నారు.

 

మర్రిగూడలోనూ ఘనంగా దసరా వేడుకలు

 

నల్లగొండ పట్టణ పరిధిలోని 13వ డివిజన్ మర్రిగూడ గ్రామంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ వేడుకలు సందడిగా జరిగాయి.