కాకతీయ వింటేజ్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కాకతీయ వింటేజ్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు హన్మకొండ, అక్టోబర్ 19 (విజయ కెరటం):   హన్మకొండ జిల్లా హసన్‌పర్తి 66వ డివిజన్‌లోని కాకతీయ వింటేజ్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, కాలనీ వాసులు ఆటపాటలతో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.   కాలనీ కమిటీ సభ్యుల సహకారంతో వేడుకలను అద్భుతంగా నిర్వహించినట్లు కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ కాలనీలో అందరూ కలిసి వేడుకలను విజయవంతం చేసుకున్నారని ఆయన...