VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 1:47 pm Posted by : VIJAYA KERATAM

భద్రకాళి నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

భద్రకాళి నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకల

 

హన్మకొండ, అక్టోబర్ 18 (విజయ కెరటం): హన్మకొండలోని భద్రకాళి నగర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయ పద్ధతిలో ఉత్సాహంగా జరుపుకున్నారు.

 

ఈ వేడుకల్లో శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ రెడ్డి, విజయ్ కుమార్, కృష్ణ, పోరెండ్ల ప్రభాకర్, రాజమౌళి, శివాజీ, నారాయణస్వామి, సుధాకర్ రెడ్డి, మురళి, ప్రేమకుమార్, రవి నాయక్, గబ్బిట కుమారస్వామి, పచునూరి కరుణాకర్, శ్రీనివాస్, చిట్యాల కరుణాకర్ తదితరులతో పాటు గార్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

సీఐ స్వామి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలతో భద్రకాళి నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.