VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 5:48 am Posted by : VIJAYA KERATAM

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*  *మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*

*ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు*

 

*మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి*

*కోదాడ (విజయ కెరటం స్టేట్ బ్యూరో- గౌస్)*

 

విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటీ పారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఇంటా, రైతులలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. దృఢమైన సంకల్పం, పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక సిద్ధిస్తుందనే స్ఫూర్తిని ఈ పండుగ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

దుర్గాదేవి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, చేపట్టిన ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సానుకూలత, విజయాలను తీసుకురావాలని మంత్రి

కోరినారు.