VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:41 am Posted by : VIJAYA KERATAM

ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈనెల 26 నుంచి చెల్లింపులు

ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈనెల 26 నుంచి చెల్లింపులు

నల్గొండ, అక్టోబర్ 17 (విజయ కెరటం): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆలస్యంగా ఫీజు చెల్లించే విద్యార్థులకు రూ.2,000 జరిమానాతో డిసెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

 

ఫస్టియర్ రెగ్యులర్, సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.540గా నిర్ణయించారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ సైన్స్‌తో పాటు ఒకేషనల్ విద్యార్థులకు రూ.890గా ఖరారు చేశారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించి, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.