VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:53 pm Posted by : VIJAYA KERATAM

TGO బతుకమ్మ సంబురాలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం

TGO బతుకమ్మ సంబురాలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయ కెరటం):

 

TGO సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 బతుకమ్మ సంబురాలకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి సీతక్కను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో మంత్రి సీతక్కను TGO మహిళా విభాగం చైర్‌పర్సన్ జి. దీపారెడ్డి, కన్వీనర్ జె. సుజాత, హైదరాబాద్ జిల్లా TGO అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, మహిళా విభాగం కోశాధికారి శాంతిశ్రీ తదితరులు కలిసి వేడుకలకు ఆహ్వానించారు.

 

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ రమణ నాయక్, TGO ఇంజినీర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఇంజినీర్ సిద్ధార్థ్‌తో పాటు పంచాయతీరాజ్ శాఖకు చెందిన పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఎం.బి. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, అక్టోబర్ 14న మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లిలోని TGO భవన్‌లో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

జై తెలంగాణ.. జై బతుకమ్మ!