ఆయుష్ విభాగంలో ఉద్యోగావకాశాలు.. నల్గొండ జిల్లాలో 8 పోస్టుల భర్తీ

నల్గొండ, అక్టోబర్ 8 (విజయ కెరటం): జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద నల్గొండ జిల్లాలో వివిధ పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆయుష్ శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 8 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో చీఫ్ ఆయుష్ వైద్యుడు–1 పోస్టు నెలకు రూ.60,000, ఆయుష్ వైద్య అధికారి–2 పోస్టులు నెలకు రూ.40,000, ఫార్మసిస్ట్ (డ్రగ్ టెక్నీషియన్)–1 పోస్టు నెలకు రూ.20,000, మసాజిక్/మసాజిస్ట్–1 పోస్టుకు రోజుకు రూ.500, యోగా నిపుణుడు–1 పోస్టుకు నెలకు రూ.28,000,...