VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 3:23 am Posted by : VIJAYA KERATAM

తెలంగాణ ఓటర్లకు కీలక సమాచారం.. ఓటు నమోదు చేసుకునే అవకాశం

హైదరాబాద్ సెప్టెంబర్ 4 విజయ కెరటం ప్రతినిధి: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం ఓటర్ల పేర్ల తొలగింపులో నోటీసు, విచారణకు అవకాశం వంటి విధివిధానాలను పాటించాల్సి ఉంటుంది.

అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు కోసం ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు, వివరాల్లో మార్పులు ఉంటే సంబంధిత ఫారమ్‌ల ద్వారా క్లెయిమ్ లేదా అభ్యంతరాన్ని సమర్పించే అవకాశం ఉంటుంది.

ECI విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణకు సంబంధించిన SIRలో తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1, 2026న ప్రచురించాల్సి ఉంది.