రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ, అక్టోబర్ 19 (విజయ కెరటం): రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా...