VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 1:44 pm Posted by : VIJAYA KERATAM

రూ.లక్ష లంచం తీసుకుంటూ రంగారెడ్డి DMHO స్వర్ణకుమారి అరెస్ట్.. ACB వలలో అధికారి!

ఆస్పత్రి ప్రారంభించేందుకు అనుమతి విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ACB అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) స్వర్ణకుమారి పట్టుబడ్డారు. ఆమెతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్‌ను కూడా ACB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురిని విచారిస్తూ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.