VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 6:15 am Posted by : VIJAYA KERATAM

చాట్‌జీపీటీ సాయంతో సివిల్స్‌లో ఐదో ర్యాంకు.. యువతి సత్తా! రోజుకు 8 గంటల చదువు.. సోషల్ మీడియాకు దూరం.. ఏఐతో సందేహాల నివృత్తి

హర్యానా: అక్టోబర్ 11 విజయ కెరటం ప్రతినిధి చాట్‌జీపీటీని అధ్యయన సాధనంగా ఉపయోగించుకుంటూ హిసార్‌కు చెందిన ఛావి హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐదో ర్యాంకు సాధించింది. మొత్తం 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది.

బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమైన ఛావి రోజుకు సుమారు 8 గంటలు చదువుతూ, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. చదువులో ఎదురైన సందేహాలను చాట్‌జీపీటీ సాయంతో నివృత్తి చేసుకుంటూ స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. ఎలాంటి ప్రత్యేక కోచింగ్‌పై ఆధారపడకుండా తన చదువును ప్రణాళికాబద్ధంగా కొనసాగించింది.

దాదాపు 60 వేల మంది పరీక్షకు హాజరైనట్లు సమాచారం. వారిలో ఐదో ర్యాంకు సాధించిన ఛావి తన కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన తొలి వ్యక్తిగా నిలిచింది. సాంకేతికతను సరైన విధంగా ఉపయోగించుకుంటూ పట్టుదలతో చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చని ఆమె విజయం చాటిచెబుతోంది.