VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:13 am Posted by : VIJAYA KERATAM

విధులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సైకి తీవ్ర గాయాలు

విధులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సైకి తీవ్ర గాయాల మిర్యాలగూడ అక్టోబర్ 14 విజయకేరటం: రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై అత్తి సతీష్ తీవ్రంగా గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఆయన బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం.

 

ఈ ప్రమాదంలో సతీష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడలోని లీల ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. సతీష్ స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం.