కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి.. బాధితులకు సత్వర న్యాయం అందించాలి శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ
సూర్యాపేట (విజయ కెరటం స్టేట్ బ్యూరో గౌస్): సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పోలీసు సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించి, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి బ్లూ కోల్ట్స్, పెట్రో కార్, డయల్ 112 సిబ్బంది తమ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లు,...