జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం పోస్టుకార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ తిప్పర్తి, అక్టోబర్ 1 (విజయ కెరటం): జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే(143) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల పోస్టుకార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే(143) తిప్పర్తి మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా...