రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తిప్పర్తి వర్షిణి!
జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపిక.. అశ్వారావుపేటలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం తిప్పర్తి, అక్టోబర్ 10 (విజయ కెరటం ప్రతినిధి): గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటవచ్చని తిప్పర్తి విద్యార్థిని జెర్రిపోతుల వర్షిణి నిరూపించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న వర్షిణి తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 10 నుంచి 13 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగే...