VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 2:41 pm Posted by : VIJAYA KERATAM

నీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా

నీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమాన

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయ కెరటం): హైదరాబాద్‌లోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి (HMWSSB) రూ.20 వేల జరిమానా విధించింది. తాగునీటిని భారీగా వృథా చేసినట్లు అధికారులు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌-16 అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ప్యారడైజ్ హోటల్‌లో నీటి వృథాను గుర్తించారు. దీంతో హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు.

నీటిని పొదుపుగా వినియోగించాలి

తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని జలమండలి అధికారులు హోటల్ యాజమాన్యానికి సూచించారు. నీటి వృథాకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర ప్రజలు, వ్యాపార సంస్థలు నీటి సంరక్షణకు సహకరించాలని అధికారులు సూచించారు.