ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతూ.. రైలు ప్రమాదంలో యువకుడి మృతి

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతూ.. రైలు ప్రమాదంలో యువకుడి మృతి గజపతినగరం, నవంబర్ 11 (విజయ కెరటం): చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పురిటిపెంట గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్ (21) రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. చెవిలో ఇయర్‌ఫోన్స్ ఉండటంతో రైళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయిన పవన్.. ఒక రైలును తప్పించుకునే క్రమంలో మరో రైలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు....