నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య ఉద్యోగం.. 14 మంది అరెస్ట్!

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య ఉద్యోగం.. 14 మంది అరెస్ట్ రూ.13 లక్షలకు ఒప్పందం.. రూ.5 లక్షల నగదు, కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం నల్లగొండ, నవంబర్ 08 (విజయ కెరటం): ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగానే మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన భారీ మోసాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ అక్రమ వ్యవహారంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన...