నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి
నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టాలి.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల నల్లగొండ, నవంబర్ 18 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 18, 19, 22వ డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి బుధవారం స్థానిక కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఆయా డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనుల నాణ్యతను తనిఖీ చేసి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18వ డివిజన్లో ఎన్హెచ్ డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలను...