VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 5:04 pm Posted by : VIJAYA KERATAM

నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బదిలీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఎన్. శ్రీజారెడ్డికి అదనపు బాధ్యతలు

నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బదిలీ

ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఎన్. శ్రీజారెడ్డికి అదనపు బాధ్యతల

నల్లగొండ, నవంబర్ 18 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని టీయూఎఫ్ఐడీసీ (TUFIDC) కార్యాలయంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా ఆయనను నియమించింది. వెంటనే టీయూఎఫ్ఐడీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముందు రిపోర్టు చేయాలని ఆదేశించింది.

అలాగే నల్లగొండ కార్పొరేషన్ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీజారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగనున్నారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.