VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 1:28 pm Posted by : VIJAYA KERATAM

నేడు నల్లగొండ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నేడు నల్లగొండ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార

పాల్గొననున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రూ.30.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నల్లగొండ, నవంబర్ 4 (విజయ కెరటం):

నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఉదయం 10 గంటలకు ఇందిరా భవన్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న మంత్రి, 10.45 గంటలకు నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా నియమితులైన బైరెడ్డి హేమలత వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.

అనంతరం ఉదయం 11 గంటలకు రూ.17.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. 11.15 గంటలకు మామిళ్లగూడ మీదుగా కతాల్‌గూడ నుంచి రాజీవ్ స్వగృహ వరకు రహదారి అభివృద్ధి పనులకు సుమారు రూ.13 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేయనున్నారు.

మొత్తం రూ.30.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులతో జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు.