నేడు నల్లగొండ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నేడు నల్లగొండ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార పాల్గొననున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రూ.30.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నల్లగొండ, నవంబర్ 4 (విజయ కెరటం): నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఇందిరా భవన్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న మంత్రి, 10.45 గంటలకు నల్లగొండ వ్యవసాయ...