VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 3:16 pm Posted by : VIJAYA KERATAM

రేవంత్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి!

రేవంత్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి

కాశీబుగ్గలో ఘనంగా కేక్ కటింగ్.. పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పార్టీ నేతలు

వరంగల్, నవంబర్ 08 (విజయ కెరటం):

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. ఆదివారం కాశీబుగ్గ జంక్షన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందిస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజ్, శ్రీమన్, శిరీష, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నల్గొండ రమేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, నగర మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న, నారగోని మురళి గౌడ్, గొరంటాల రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లక్ష్మి, పలువురు డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.