దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు..

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో కొవిడ్‌ పరిస్థితి అదుపులోనే ఉంది. తెలంగాణలో కొవిడ్‌ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ, ఇది సీజనల్‌ ప్రభావంగా కనిపిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఏపీలో 74 కేసులు నమోదవగా, 56 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.